పెండింగ్ డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్: మంత్రి పొంగులేటి

  • హైదరాబాద్‌లో ఇళ్ళ స్థలాలు ఉంటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న మంత్రి
  • జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడి
  • విధివిధానాలను ఈ నెల 21న ఖరారు చేస్తామన్న మంత్రి
పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో స్థలాలు ఉన్నవారికి ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ళ రెండో రెండో విడత పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు.

రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆదిలాబాద్‌లో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. రెండో విడతకు సంబంధించిన విధివిధానాలను ఈ నెల 21న ఖరారు చేస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ కోసం స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి తెలిపారు.

Ponguleti Srinivas Reddy
Telangana
Double Bedroom Houses
Indiramma Houses
Housing Scheme

More Telugu News